Nara Lokesh Birthday : యువగళం సారథి.. నవశకానికి వారధికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
Nara Lokesh Birthday : రాజకీయాలు అంటే ఖూనీలు, కబ్జాలు, స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించిన వారికి మాత్రమే అని అనుకునేవారికి… స్టాన్ ఫర్డ్ లో చదువుకు వచ్చిన వారికి కూడా చేతనవుతాయని నిరూపించిన వ్యక్తి
- Author : Sudheer
Date : 23-01-2025 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh Birthday : నారా లోకేష్ (Minister Nara Lokesh)..ఇది పేరు కాదు బ్రాండ్(Minister Nara Lokesh Brand) గా మారింది. కొద్దీ రోజుల క్రితం వరకు నారా లోకేష్ అంటే సాధారణ నేతగా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు లోకేష్ సత్తా ఏంటో తెలిసి, లోకేష్ సాధారణ నేత కాదు ఓ బ్రాండ్ అంటున్నారు. ఆనాడు విమర్శలు చేసిన వారే..ఈనాడు జై..జై లు పలుకుతున్నారు. రాజకీయాలు అంటే ఖూనీలు, కబ్జాలు, స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించిన వారికి మాత్రమే అని అనుకునేవారికి… స్టాన్ ఫర్డ్ లో చదువుకు వచ్చిన వారికి కూడా చేతనవుతాయని నిరూపించిన వ్యక్తి లోకేష్.
IT Raids : సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్..ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. లోకేష్ చొరవ చూస్తున్న పారిశ్రామికవేత్తలు భారత రాజకీయాల్లో ఇలాంటి చదువుకున్న రాజకీయ నేతల అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రజల్లో మాస్ లీడర్ గా ..దావోస్ పర్యటనలో విజన్ ఉన్న లీడర్ గా లోకేష్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి లీడర్ నేడు నలభైల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా కూటమి నేతలు , శ్రేణులే కాదు ఇతర రంగాల వారు సైతం లోకేష్ పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ తెలియజేస్తూ..మరిన్ని విజయాలు సాధించి, తెలుగు ప్రజల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నారు.