HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Chandrababus Key Comments On Nara Lokeshs Political Legacy

Political Legacy : లోకేశ్ రాజకీయ వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజకీయాలతో(Political Legacy) పాటు వ్యాపారాలు, సినిమాలు, కుటుంబం ఇలా ఎక్కడైనా వారసత్వం అనేది అస్సలు ఉండదని.. వాటన్నింటిలో వారసత్వం ఉంటుందనే ఆలోచనే సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. 

  • Author : Pasha Date : 23-01-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Cm Chandrababu Nara Lokesh Political Legacy Tdp Ap

Political Legacy :  వారసత్వ రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి 33 ఏళ్ల నుంచి వ్యాపారాలున్నా, ప్రజా సేవ చేయాలనే ఏకైక ఆలోచనతో లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు. ఇందులో వారసత్వం అనే దానికి తావు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌‌లో పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవకాశాలు అనేవి చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వస్తాయని, వాటిని అందిపుచ్చుకునే వారే రాణిస్తారని చంద్రబాబు చెప్పారు.  తాను ఎన్నడు కూడా జీవనోపాధి కోసం రాజకీయాలు చేయలేదని ఆయ తేల్చి చెప్పారు. తమకు 33 ఏళ్ల నుంచీ కుటుంబ వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయాలతో(Political Legacy) పాటు వ్యాపారాలు, సినిమాలు, కుటుంబం ఇలా ఎక్కడైనా వారసత్వం అనేది అస్సలు ఉండదని.. వాటన్నింటిలో వారసత్వం ఉంటుందనే ఆలోచనే సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read :AI Data Centers : ఏఐ పెట్టుబడుల రేసులో తెలుగు రాష్ట్రాలు

జగన్‌పై కక్ష సాధింపులకు దిగేది లేదు

‘‘రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితంలోనైనా నేను విలువలను పాటిస్తాను. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే దానికి కారణం మనకున్న విలువలే’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. మాజీ సీఎం జగన్‌పై కానీ, వైఎస్సార్ సీపీ నేతలపై కానీ కక్ష సాధింపులకు దిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. ‘‘మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే ఎలా ?’’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘‘ఎవరైనా ప్రజల్ని ఒకసారే మోసం చేయగలరు. నిరంతరం చేయలేరు’’ అని  తెలిపారు. ‘‘జగన్ హయాంలో జరిగిన అదానీ విద్యుత్తు కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా?’’ అని మరో విలేకరి ప్రశ్నించగా..  ‘‘ఆ అంశం ప్రస్తుతం అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Also Read :Revanth Reddy Praises : దావోస్ వేదికగా చంద్రబాబు పై సీఎం రేవంత్ ప్రశంసలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP CM
  • chandrababu
  • CM Chandrababu
  • nara lokesh
  • political legacy
  • tdp
  • ysrcp

Related News

Jr Ntr Birthday Wishes To C

Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు

  • Chandrababu Once Again Show

    CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Latest News

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

  • RTC: ఆర్టీసీ సమ్మె విరమించండి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..

  • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

  • టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్‌ రగడ

  • ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్

Trending News

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd