Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
- By hashtagu Published Date - 01:18 PM, Thu - 23 December 21

‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని అన్నారు.