The Paradise : వివాదంలో నాని మూవీ
తను గతంలో చేసిన ఒక రీల్‌లోని స్టెప్పును, నాని వేసిన హుక్ స్టెప్పును పక్కపక్కన పెట్టి చూపిస్తూ "వారు నా స్టెప్పును కాపీ చేశారు" అని ఘాటుగా స్పందించారు.
- Author : Sudheer
Date : 26-02-2026 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
The Paradise : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని మొదటి సాంగ్ “ఆయా షేర్” సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన మాస్ బీట్‌కు నాని వేసిన సిగ్నేచర్ హుక్ స్టెప్పుకు యువత ఫిదా అయ్యారు. అయితే, ఈ స్టెప్పు తన డ్యాన్స్ మూమెంట్స్ నుంచి కాపీ కొట్టారంటూ ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ, డ్యాన్సర్ బాబా జాక్సన్ (యువరాజ్ సింగ్) ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాబా జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. తను గతంలో చేసిన ఒక రీల్‌లోని స్టెప్పును, నాని వేసిన హుక్ స్టెప్పును పక్కపక్కన పెట్టి చూపిస్తూ “వారు నా స్టెప్పును కాపీ చేశారు” అని ఘాటుగా స్పందించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నాని అభిమానులు మరియు బాబా జాక్సన్ ఫాలోవర్ల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. నాని ఫ్యాన్స్ బాబా జాక్సన్‌ను ట్రోల్ చేస్తూ, ఆయన కూడా మైఖేల్ జాక్సన్ స్టైల్‌ను అనుకరిస్తారని గుర్తు చేయగా.. దానికి ఆయన “నేను కాపీ చేయను, అప్‌గ్రేడ్ చేస్తాను” అంటూ ధీటుగా బదులిచ్చారు.
సాధారణంగా డ్యాన్స్ మూమెంట్స్‌లో కొన్ని పోలికలు ఉండటం సహజమేనని, చిన్న చిన్న సిమిలారిటీస్ ఉన్నంత మాత్రాన దాన్ని చౌర్యం అనలేమని డ్యాన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలతో గుర్తింపు పొందిన బాబా జాక్సన్ నేరుగా ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ముదిరింది. ప్రస్తుతం ఈ విషయంపై చిత్ర దర్శకుడు లేదా కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ స్పందించి ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతుందో లేదో వేచి చూడాలి.