YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- Author : Gopichand
Date : 29-11-2022 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. షర్మిలతో పాటు మరో ఐదుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా.. షర్మిల తరపున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నాంపల్లి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.