HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mukesh Ambani Sells Luxurious Manhattan Property Worth %e2%82%b974 5 Crore

Mukesh Ambani: ఏకంగా అన్ని రూ. కోట్లకు లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముఖేష్ అంబానీ?

ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలి

  • Author : Anshu Date : 09-08-2023 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mukesh Ambani
Mukesh Ambani

ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు ముకేశ్ అంబానీ సుపరిచితమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులలో టాప్ ఫైవ్ లో ముఖేష్ అంబానీ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ముఖేష్ అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నది ఆయనకే తెలియదు. ఆయన రోజు సంపాదన కోట్లల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతూ అంబానీ ఇద్దరు కూడా ప్రతిరోజు లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ముకేశ్ అంబానీ సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముకేశ్ కి చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట. నాలుగో ఫ్లోర్‌లో 2406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని 9 మిలియన్ డాలర్లకు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.74.5 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఇల్లు హడ్సన్ నదీ తీరాన ఉంది. ఇందులో రెండు బెడ్‌రూంల నుంచి ఈ నది చుట్టూ ప్రకృతి అందాలను చూసేందుకు అందంగా నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు.

ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. పది అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్స్, బయటి శబ్ధాలు లోపలికి వినిపించకుండా నిరోధించే కిటికీలు వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి..ఇక అంబానీకి ముంబయిలో ఆంటిలియా అనే ఇల్లు కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాసంగా పేరుగాంచింది. ఇక దీని విలువ రూ.15 వేల కోట్లకుపైనే ఉంటుంది. సుమారు 27 అంతస్తుల ఈ భవనంలో 60 ఫ్లోర్స్ ఉంటాయి. ఇందులోనే హెలిప్యాడ్, టెంపులు, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ లో దాదాపు 600 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుంటారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున నెలజీతం ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా అంబానీకి ఇంకా అమెరికా, యూకే, దుబాయ్ వంటి దేశాల్లో కూడా విలాసవంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • luxurious manhattan property
  • mukesh ambani
  • sells luxurious manhattan property

Related News

Iranian President Masoud Pezeshkian

యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

Masoud Pezeshkian  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way […]

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd