HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Msk Prasad Feels Good After Watching Hardik Pandya Doing Well

Hardik Pandya:హార్ధిక్ పాండ్యాపై ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసలు

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు.

  • Author : Hashtag U Date : 07-04-2022 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Pandya

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. తొలుత వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌‌రౌండర్ షో కనబర్చాడు. కెప్టెన్సీతో పాటు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 28 బంతులు ఆడిన పాండ్య ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులు చేశాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పాండ్య రాణించాడు. ఈ మ్యాచ్ లో 27 బంతులు ఆడిన హార్దిక్ నాలుగు ఫోర్లతో 31 పరుగులు సాధించాడు… అయితే ఈసారి ఐపీఎల్ లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్‌ పాండ్యాపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ పొగడ్తల జల్లు కురిపించాడు.

ఐపీఎల్‌ 15వ సీజన్ లో గుజరాత్‌ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ దుమ్మురేపుతున్నాడని పేర్కొన్నాడు. మైదానంలో హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్న తీరు అద్భుతంగా ఉందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో ఎంఎస్కె ప్రసాద్ మాట్లాడుతూ.. హార్దిక్‌ పాండ్యా 2016లో టీమిండియాకు ఎంపిక కావడంలో నేనే ముఖ్య పాత్ర పోషించాను. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్న అతడు స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ప్రసుతం హార్దిక్ పాండ్య ఆటగాడిగా చాలా పరిణతి చెందాడు.గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా వ్యవహరించడం తన అంతర్జాతీయ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది త్వరలోనే హార్దిక్ మళ్ళీ భారత జట్టులోకి రావడం ఖాయమని అని ఎంఎస్కె ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే లక్నో సూపర్ జాయింట్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 8న పంజాబ్‌ కింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gujarat Titans
  • Hardik Pandya
  • IPL 2022
  • MSK prasad

Related News

Hardik Pandya

అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

    Latest News

    • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

    • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

    • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

    • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd