MS Dhoni: ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే బీసీసీఐ లీగ్ కు సంబంధించి ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
- By Hashtag U Published Date - 12:30 PM, Tue - 8 March 22

ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే బీసీసీఐ లీగ్ కు సంబంధించి ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ధోని సేన కోసం ప్రత్యేకంగా సూరత్‌లో క్యాంపులో ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో ధోనితో పాటు మరికొందరు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.ముంబైలో ఉన్న పిచ్ లు సూరత్ పిచ్ లు ఒకేలా ఉండడంతో ధోనీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాడు.
ఈ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న చెన్నై కెప్టెన్ భారీ షాట్స్ ఆడుతూ పాత ధోనీని గుర్తు చేసారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్, ఫొటోస్ చెన్నై ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. వీటికి సింగమ్స్ ఇన్ సూరత్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. ఇపుడు ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి. మహేంద్ర సింగ్ ధోని, అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, హరి నిషాంత్, తుషార్ దేశ్‌పాండే ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే భారత్ ఆటగాళ్లకు బీసీసీఐ 3 రోజుల క్వారన్ టైన్ ఇచ్చింది. ఆ రూల్స్ ప్రకారం చెన్నై టీమ్ మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండి తరువాత ప్రాక్టీస్ ప్రారంబించింది.సూరత్ లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా ఈ ప్రాక్టీస్ జరుగుతోంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్ మార్చ్ 26న రన్నరప్ కలకత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఈ సారి ఐపీఎల్ 10 జట్లతో 65 రోజుల పాటు జరగనుంది. కరోనా ప్రభావంతో సీజన్ మొత్తాన్నీ మహారాష్ట్ర లోనే నిర్వహిస్తున్నారు.