Andhra Pradesh : పల్నాడు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో తల్లీకొడుకులు మృతి
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరబెట్టేందుకు వెళ్లి తల్లికొడుకు కరెంట్ షాక్‌తో మరణించారు. పల్నాడు..
- By Prasad Published Date - 01:58 PM, Thu - 24 November 22
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరబెట్టేందుకు వెళ్లి తల్లికొడుకు కరెంట్ షాక్‌తో మరణించారు. పల్నాడు జిల్లాలోని కారంపూడి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన అంగడి నాగమ్మ(50), రామకోటేశ్వరరావు(30) గురువారం బట్టలు ఉతుకుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.