HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >More Than 550 Hajj Pilgrims Die In Mecca

Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి

సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది.

  • Author : Pasha Date : 19-06-2024 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hajj Pilgrims Min

Hajj Pilgrims : సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఈసారి దాదాపు 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లగా.. వివిధ దేశాలకు చెందిన దాదాపు 550 మంది యాత్రికులు చనిపోయారు. వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్టు దేశస్తులే కావడం గమనార్హం. హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్స్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వయసు పైబడినవారు, తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు 60 మంది జోర్డాన్ దేశస్తులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వెళ్లిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్ దేశాల హజ్ యాత్రికులు(Hajj Pilgrims) కూడా కొందరు చనిపోయారు. సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయి. పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా 240 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.

Also Read : Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు

  • హజ్‌ యాత్రలో భాగంగా జూన్ 17న (సోమవారం) మీనాలో సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది. ఆ రోజు తెల్లవారుజామునే జమారత్‌ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో హజ్ యాత్రికులు చేరుకున్నారు. గులకరాళ్లతో మూడు రాతి స్తంభాలను కొట్టారు. ఈ స్తంభాలనే సైతానుగా భావిస్తారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఐదు గంటలసేపు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో) సౌదీ అధికారులు నిలిపివేశారు.
  • మంగళవారం కూడా రాళ్లతో సైతానును కొట్టే కార్యక్రమం జరిగింది.
  • అనంతరం హజ్ యాత్రికులు మక్కాకు చేరుకున్నారు. కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు. దీంతో ఈసారి హజ్ యాత్ర ముగిసింది.

Also Read : PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hajj Pilgrims
  • Hajj Pilgrims Die
  • Mecca
  • Saudi Arabia

Related News

China Faces Significant Losses from Trump's Attack in Iran

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా స్పందించింది. పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలో డ్రాగన్ కంట్రీ ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను,

  • Indian Expats

    గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!

  • Formula 1

    ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..

  • Iran Attacks World's Larges

    US Iran War : ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ పై ఇరాన్ దాడి

Latest News

  • టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

  • నేపాల్ ప్ర‌ధానిగా మాజీ మేయర్ బాలెన్ షా?

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

  • దిండుపై త‌ప్పుగా ప‌డుకుంటున్నారా?!

  • ఏ కారు కొంటే మంచిది?!

Trending News

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd