TRS MLA’s : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. ముగ్గురు రిమాండ్‌ని..?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చినట్లు ఆరోపణలు..
- By Prasad Published Date - 06:54 AM, Fri - 28 October 22

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి రిమాండ్‌ని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి రిజక్ట్ చేశారు. ఫాంహౌజ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురిని తక్షణమే విడుదల చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన విధానాన్ని ఏసీబీ న్యాయమూర్తి తప్పుబట్టారు. పెట్టిన సెక్షన్ లకు సరైన సాక్ష్యధారాలు లేవని..ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.