Rains: ఏపీకి వర్ష సూచన.. మోస్తరు నుంచి భారీ వర్షాలు!
- By Balu J Published Date - 02:34 PM, Wed - 12 January 22
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, బుధవారం ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలతో పాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల మండలాల్లో బుధవారం వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు, కొన్ని జిల్లాల్లో వరి కుప్పలు పొలాల్లోనే ఉండిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.