HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc K Kavitha Slams Narendra Modi Govt For Schemes

Kavitha Slams Modi Govt: కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణమాపీ చేసి,

  • Author : Balu J Date : 09-08-2022 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణమాపీ చేసి, పేదలకు సంక్షేమ పథకాలు ఆపాలని కుట్ర పన్నుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్రలు పన్నుతూ, కోర్టులను సైతం ఉపయోగించుకుంటున్న బీజేపీ ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని కవిత తెలిపారు.

తెలంగాణలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. “40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. మరో 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ గారు ఇటీవలే ప్రకటించారు. 65 లక్షల రైతులకు రైతు బంధు, ప్రతి రంగంలో ఉన్న పేదవారికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. తెలంగాణ బాటలోనే అనేక రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తున్నా”యని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘రైతు బంధు ఆపుకోవాలా, గురుకుల విద్యను ఆపుకోవాలా, చేపలు, గొర్రెల పంపకం ఆపుకోవాలా..ఆసరా బీడీ పెన్షన్లు ఆపుకోవాలా.. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆలోచించాల’ని కవిత పిలుపునిచ్చారు. ఉచితం అంటే ప్రజలు పేదరికం నుండి బయటపడాలని, పేద ప్రజల్లో అభ్యున్నతి రావాలని ప్రభుత్వం చేసే సహాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సంక్షేమాన్ని, ఉచితాన్ని వేరుగా చూడాలని బీజేపీ ప్రభుత్వానికి ఆమె సూచించారు.

పేదలకు ఉచితాలు ఆపి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తులకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేయాలి.. కానీ పేదలకు పెన్షన్ వద్దా… అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల ప్రజలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమీక్ష కోసం పంపిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, దానిపట్ల మనకున్న వ్యతిరేకతను వ్యక్త పరిచినప్పుడే ఆ నిర్ణయాన్ని ఆపే అవకాశం ఉంటుందని అన్ని రాష్ట్రాలకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Modi
  • hard comments
  • kalvakuntla kavitha
  • MLC

Related News

Delhi High Court deals a blow to Kavitha.

kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd