MLA Roja: చంద్రబాబుపై రోజా షాకింగ్ కామెంట్స్..!
- Author : HashtagU Desk
Date : 08-03-2022 - 3:41 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎమ్మెల్యే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా దినోత్సవ వేడుకుల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.
రాష్ట్రంలో మహిళలు అడక్కుండానే వారికి జగన్ ఎంతో మేలు చేస్తున్నారని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా సీయం జగన్‌కు జై కొట్టాలని, ఆ సౌండుకు చంద్రబాబు గుండెల్లో రీసౌండ్ రావాలని రోజా అన్నారు. ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేనిదాన్ని చిన్న వయసులో జగన్ చేసి చూపించారని, మహిళలకు సాధికారత కల్పించారని, దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్‌కు జగన్ పై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. నారావారి నరకాసుర పాలనలో.. మహిళలపై దాడి చేసిన ఘనత టీడీపీ నేతలదే అని రోజా వ్యాఖ్యలు చేశారు. మరి రోజా వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.