MLA Roja: రాజీనామా ప్రచారం.. ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్..!
- Author : HashtagU Desk
Date : 07-02-2022 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీని వీడుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన రాజీనామా ప్రచారం పై, నగరి నియోజకవర్గంలో పరిణామాల పై ఫైర్‌బ్రాండ్ రోజా స్పందించారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాని, అయినా సహనంతో దిగమింగుకుని ముఖ్యమంత్రి జగన్ కోసం పార్టీలోనే కొనసాగుతున్నానని రోజా అన్నారు.
ఇక గత కొద్దిరోజులుగా తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరుగుతుందని, కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అవసరమైతే రాజీనామా చేస్తానుగానీ, ప్రార్టీ మారే చాన్స్ లేదని రోజా స్పష్టం చేశారు. తప్పు చేసిన వారే పార్టీ మారుతారని, తనకు ఆ అవసరం లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి తనతో ఉన్నానని, జగన్ పై నమ్మకం ఉన్నవాళ్ళకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కాగా వరుసగా రెండు సార్లు, వైసీపీ నుండి నగరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా, సీఎం జగన్ క్యాబినేట్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.