HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tvk Vijay With Jagan

జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు

  • Author : Sudheer Date : 08-02-2026 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Vijay
Jagan Vijay

చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకలో రాజకీయ, సినీ రంగానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు కలవడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపకుడు విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జగన్ మరియు విజయ్ కలయికే. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు విష్ చేసుకోవడం చూస్తుంటే కేవలం మర్యాదపూర్వక భేటీ కంటే ఎక్కువే ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.

ప్రస్తుతం విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘TVK’ పార్టీని స్థాపించి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తన కేడర్‌ను తిరిగి పుంజుకునేలా చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన తరుణంలో, అనుభవం ఉన్న నాయకుడిగా జగన్ నుంచి కొన్ని సూచనలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేయడం వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగి ఉండవచ్చని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

జగన్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కాగా, విజయ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చూసి ఇరు వర్గాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. “టూ ఐకాన్స్ ఇన్ వన్ ఫ్రేమ్” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒకరు ఏపీ రాజకీయాల్లో పట్టున్న నేత, మరొకరు తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్న నేత కావడంతో, ఈ కలయిక భవిష్యత్తులో ఏదైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • tvk
  • TVK Vijay
  • ys jagan

Related News

Chandrababu Naidu

Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd