Gang Rape Case : హైదరాబాద్లో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేటలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి...
- By Prasad Published Date - 10:59 AM, Tue - 8 November 22

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేటలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ బాలిక, నిందితులు ఒకే ప్రాంతానికి చెందినవారని.. ఒకరికొకరు తెలిసిన వారని పోలీసు వర్గాలు తెలిపాయి. మైనర్ బాలికను ముగ్గురు యువకులు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.