Minister Vemula: కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి: మంత్రి ప్రశాంత్ రెడ్డి
వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.
- By Balu J Published Date - 05:58 PM, Tue - 26 September 23

బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్, మెండోరా మండలాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ప్రజలు డప్పు చప్పుళ్లతో,మహిళలు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ముప్కాల్ మండల కేంద్రంలో 1.95 కోట్లతో ముప్కాల్ నుండి మెండోరా వరకు బిటి రోడ్ రిన్వల్ పనుల శంకుస్థాపన, మెండోరా మండలం సొన్ పెట్ గ్రామంలో సొన్ పెట్ నుండి అప్రోచ్ రోడ్ కాకతీయ కెనాల్ బ్రిడ్జ్ వరకు 35 లక్షల వ్యయం,మెండోరా మండలం దూదిగాం గ్రామంలో సర్వీస్ రోడ్ NH 44 నుండి శివాజీ విగ్రహం వరకు 55 లక్షల వ్యయంతో,
దూదిగాం నుండి మేండోరా వరకు వయా కాకతీయ కెనాల్ 1.30 కోట్ల వ్యయంతో,పోచంపాడ్ గ్రామంలో 1.30 కోట్లతో NH 44 నుండి SRSP డ్యామ్ వరకు సెంట్రల్ లైటింగ్ పనుల శంకుస్థాపన,మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో వెల్కటూర్ నుండి వెల్కటూర్ తండా వరకు బిటి రోడ్ రిన్వల్ 1.60 కోట్ల వ్యయంతో, వెల్కటూర్ వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణం (NH 16 TO NH7 వయా రేంజర్ల,దోన్కల్ రోడ్) 2.50 కోట్ల వ్యయంతో, మెండోరా మండలం సావేల్ గ్రామంలో స్లాబ్ కల్వర్టు నిర్మాణం (NH 16 TO NH7 వయా రేంజర్ల,దోన్కల్ రోడ్) 80 లక్షల వ్యయంతో,మేండోరా మండల కేంద్రంలో స్లాబ్ కల్వర్టు నిర్మాణం మేండోరా దూదిగాం రోడ్డు పై 80 లక్షల వ్యయంతో,మెండోరా మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు,మరియు సెంట్రల్ లైటింగ్,డ్రైన్స్ పొడిగింపు పనులు 2.00 కోట్లతో ,మెండోరా శుక్రవారం దేవి టెంపుల్ రోడ్ రూ.1 కోటి వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు.
కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమయ్యింది మంత్రి వేముల స్పష్టం చేశారు. వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా మండలాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేసుకున్నామని వివరించారు. ఇక అర్రాసు పాట లెక్క హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ను,ఓట్లు వేసుకున్నాక మొహం చాటేసే బీజేపీ ని ప్రజలు నమ్మొద్దని అన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ ఇవ్వరు..ఇక్కడ మాత్రం అన్ని ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఓట్లు అయితే డబ్బాల పడనీ, తర్వాత చూద్దాం అనే రకాలని అన్నారు. వారి మభ్యపెట్టే హామీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ,మోస పోతే గోస పడతామని అన్నారు.
Also Read: Dil Raju: యానిమల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు సొంతం
Related News

NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి అనంతరం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకు�