Hyderabad: క్వాంటమ్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
- By Balu J Published Date - 06:05 PM, Wed - 13 September 23

ఆర్టిఫీషియల్ ఇంజలీజెన్స్, కొత్త సాంకేతికల నేపథ్యంలో మానసిక ఒత్తిడిలను తట్టుకోవడానికి, నయం చేసుకోవడానికి క్వాంటమ్ ఉత్పత్తుల అవసరం ఎంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సేవలు దేశంలో మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ లో లభించడం కూడా సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ హెడ్ క్వార్టర్ అమెరికా న్యూ జెర్సీలో ఉందని, ప్రపంచ స్థాయి సదుపాయాలన్నీ ఇక్కడ లభించనున్నాయని మంత్రి తెలిపారు.
ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్వాంటమ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. క్వాంటమ్ సేవలను మంత్రి బుధవారం మాదాపూర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు రాజ్యసభ సభ్యులు ఒద్దిరాజు రవిచంద్ర, సినీ నిర్మాత దిల్ రాజు, నిర్వాహకులు నరేందర్, సంజయ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLC Kavitha: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కవిత, గాంధీ కుటుంబానికి సూటి ప్రశ్న