165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ పై రూ.165 కోట్ల ఫైన్.. ఎందుకంటే ?
165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఏకంగా రూ.165 కోట్ల ($20 మిలియన్ల) జరిమానా పడింది. ఈ ఫైన్ ను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వేసింది.
- By Pasha Published Date - 08:48 AM, Tue - 6 June 23

165 Crores Fine On Microsoft : మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఏకంగా రూ.165 కోట్ల ($20 మిలియన్ల) జరిమానా పడింది. ఈ ఫైన్ ను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వేసింది. అమెరికాలో Xbox గేమింగ్ సిస్టమ్‌కు సైన్ అప్ చేసిన పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నందుకే ఈ ఫైన్(165 Crores Fine On Microsoft) వేశామని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వాదిస్తోంది. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఆ సంస్థ అంటోంది. తల్లిదండ్రులకు తెలియజేయకుండా పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అనేది అమెరికా పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టం (COPPA) ఉల్లంఘన కిందికి వస్తుందని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది.
Also read : Bride: మైక్రోసాఫ్ట్ దెబ్బతో సందిగ్దంలో పెళ్లికూతురు!.. ఇదెక్కడి పరిస్థితి బాబోయ్!
మైక్రోసాఫ్ట్ ద్వారా పిల్లల డేటాను పంచుకునే థర్డ్ పార్టీ గేమింగ్ పబ్లిషర్లకు కూడాఅమెరికా పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టం నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిల్లల అవతార్‌లు, బయోమెట్రిక్ డేటా, ఆరోగ్య సమాచారం వంటివి పేరెంట్స్ అనుమతి లేకుండా పిల్లల నుంచి తీసుకోవద్దని హితవు పలికింది. అమెరికా పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టం ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లలకు ఆన్‌లైన్ గేమింగ్ సేవలు అందించే వారు తాము సేకరించే వ్యక్తిగత సమాచారం గురించి ముందస్తుగా తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఆ సమాచారాన్ని సేకరించి ఉపయోగించే ముందు తల్లిదండ్రుల అప్రూవల్ పొందాలి.