Manda Krishna : సీఎం చంద్రబాబుతో మందకృష్ణ భేటీ
ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో మందకృష్ణ పలువురు ముఖ్య నేతలను కలుస్తున్నారు
- Author : Sudheer
Date : 24-08-2024 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినందుకు మందకృష్ణను చంద్రబాబు సత్కరించారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో మందకృష్ణ పలువురు ముఖ్య నేతలను కలుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Read Also : Harish Shankar : హరీష్ శంకర్ కు ఇక సినిమాలు లేనట్లేనా..?