Harish Shankar : హరీష్ శంకర్ కు ఇక సినిమాలు లేనట్లేనా..?
- By Sudheer Published Date - 07:34 PM, Sat - 24 August 24

చిత్రసీమలో సినిమా ఛాన్సులు అనేవి అందరికి దక్కవు..ఇక్కడ హిట్ పడితే తప్ప ముఖం చూడరు. అది పెద్ద డైరెక్టరైనా , చిన్న డైరెక్టరైనా..సినిమా హిట్ కొడితేనే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు సినిమాలు లేక గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు వారి లిస్ట్ లో హరీష్ శంకర్ చేరడం ఖాయమని అంత అంటున్నారు.
షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హరీష్..మొదటి సినిమాతోనే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్ , గబ్బర్ సింగ్ చిత్రాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హరీష్ నుండి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని భావిస్తుంటారు. అలాంటి హరీష్..తాజాగా మిస్టర్ బచ్చన్ తో భారీ ప్లాప్ ఇచ్చాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ..మొదటి రోజు మొదటి ఆట తోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తయితే, హరీష్‌పై జరిగిన పర్సనల్ డామేజీ మరో ఎత్తు. సోషల్ మీడియాలో హరీష్‌ని దారుణంగా ట్రోల్ చేశారు, చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మిస్టర్ బచ్చన్ కు ముందు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఓ సినిమా చేయడానికి హరీష్ అడ్వాన్స్ తీసుకొన్నాడు. వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలకు కథలు చెప్పాడు. కానీ కుదర్లేదు. ఆ తరవాత రామ్ దగ్గరకు వెళ్లాడు. రామ్ చేద్దాం అని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్ తో రామ్ సినిమా చేయడం కష్టంగా మారింది. నిజానికి రామ్ కూడా ఖాళీగా లేడు. మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ‘ఓకే’ చెప్పాడు. ‘బచ్చన్’ హిట్టయితే ఆ సినిమా పక్కన పెట్టి హరీష్ తో సినిమా చేద్దాం అనుకున్నాడు. కానీ ఇటు ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్లాప్ కావడం తో ఇప్పుడు రామ్ కూడా ఆలోచన లో పడ్డాడు. హరీష్ తో సినిమా చేసి ఇంకా రిస్క్ లో పడడం కంటే కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడం బెటర్ అని భావిస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ చేతిలో భగత్ సింగ్ తప్ప మరోటి లేదు. కానీ ఈ సినిమా ఇప్పట్లో పూర్తి అవుతుందనేది సందేహం. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఒకవేళ సినిమాలు చేసిన భగత్ సింగ్ కంటే ముందు హరిహరవిరమల్లు, OG చిత్రాలు ఉన్నాయి. ఆ రెండు పూర్తి చేసాక కానీ భగత్ సింగ్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ అవి పూర్తి అయ్యి..భగత్ సింగ్ పూర్తి కావాలంటే చాల సమయమే పడుతుంది. అప్పటివరకు హరీష్ శంకర్ కు నిరీక్షణ తప్పదు.
Read Also : VV Vinayak : డైరెక్టర్ వినాయక్ కు లివర్ సర్జరీ…?