Suicide : లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో వ్యక్తి ఆత్మహత్య
లక్నోలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
- Author : Prasad
Date : 26-09-2023 - 6:59 IST
Published By : Hashtagu Telugu Desk
లక్నోలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న శుక్లా ప్రభుత్వ నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని హైదర్‌ఘర్‌కు చెందిన 24 ఏళ్ల శ్రేష్ట తివారీగా గుర్తించారు. లక్నోలోని బక్షి కా తలాబ్ (BKT) అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా మీడియా బృందంలో తివారీ సభ్యుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం తివారీ ప్రియురాలిపై చిత్రహింసలు, వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రేష్ట తివారీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.