Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
- Author : Prasad
Date : 08-07-2022 - 1:24 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడి బలైయ్యాడు. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో గురువారం అర్థరాత్రి ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. లోన్ రికవరీ ఏజెంట్ల ఒత్తిడితో ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు అత్తాపూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన డి. దాన (36) అనే ప్రైవేట్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. తన బెడ్‌రూమ్‌లో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేధింపుల కారణంగా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించినప్పటికి మృతుడు దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.