Hyderabad: విద్యుత్‌శాఖ అధికారిపై వ్యక్తి దాడి
విద్యుత్‌శాఖలో పనిచేసే అధికారిపై వ్యక్తి చేసిన దాడి ఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)కి చెందిన విద్యుత్ అధికారిపై
- By Praveen Aluthuru Published Date - 02:58 PM, Thu - 9 November 23

Hyderabad: విద్యుత్‌శాఖలో పనిచేసే అధికారిపై వ్యక్తి దాడి చేసిన ఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)కి చెందిన విద్యుత్ అధికారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
విద్యుత్ అధికారులను దుర్భాషలాడిన వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద మీర్‌చౌక్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఇది మొదటి ఘటన కాదు. ఇంతకు ముందు కూడా బిల్లు కట్టలేదన్న కారణంతో విద్యుత్‌ను నిలిపివేసిన అధికారులను దూషించడం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. ఇలా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా కాస్త సంయమనం పాటించాలని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1722498298966335811
Also Read: Telangana: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ