Mahesh Babu:’ది ఘోస్ట్’ ట్రైలర్ ను సాయంత్రం విడుదల చేయనున్న మహేశ్ బాబు..
కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'ది ఘోస్ట్'. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కించారు.
- By Hashtag U Published Date - 01:43 PM, Thu - 25 August 22

కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కించారు. ఇంటర్ పోల్ కు చెందిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలను పోషించారు.
ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన నటించింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఇప్పటికే ఈ సినిమాకు చెందిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదలైన ‘లైగర్’ సినిమా ఇంటర్వెల్ లో ప్రదర్శించబోతున్నారు.
ఈ సినిమాకు ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. నాగార్జున కెరీర్లోనే ఈ సినిమా ఓటీటీకి అత్యధిక మొత్తాన్ని చెల్లించినట్టు ఫిలింనగర్ టాక్. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.