Delhi Capitals: లక్నో జోరుకు ఢిల్లీ బ్రేక్ వేస్తుందా?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏప్రిల్ 7 న మరో హోరాహోరీ పోరు జరుగనుంది.
- By Naresh Kumar Published Date - 06:00 PM, Wed - 6 April 22

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏప్రిల్ 7 న మరో హోరాహోరీ పోరు జరుగనుంది. మహారాష్ట్రలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. గురువారం రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మూడో మ్యాచు లో కూడా ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓటమిపాలైన రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని బావిస్తోంది.
ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టుని పరిశీలిస్తే..కెప్టెన్ కెఎల్ రాహుల్ , క్వింటన్ డి కాక్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో ఎవిన్ లూయిస్, మిడిల్ ఆర్డర్ లో మనీష్ పాండే, దీపక్ హుడా లోయర్ ఆర్డర్ లో ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక లక్నో బౌలింగ్ విషయానికొస్తే.. ఆండ్రూ టై, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టుని పరిశీలిస్తే..పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో మన్‌దీప్ సింగ్, మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్ , రోవ్‌మన్ పావెల్, లోయర్ ఆర్డర్ లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్ జరగనున్న డీవై పాటిల్ పిచ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు. ఈ పిచ్ పై బౌన్స్ ఉండటంతో మ్యాచ్ ఆరంభంలో బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కంటే కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫేవరేట్ గా అంచనా వేస్తున్నారు.