Chirutha At Srisailam: శ్రీశైలంలో పాతాళ గంగ వద్ద చిరుతపులి సంచారం
శ్రీశైలంలో మఠానికి చేరువలో ఉన్న పాతాళగంగకు వెళ్లే మార్గంలో చిరుతపులి సంచారం జరుగుతోంది. ఈ ఘటన భక్తులను మరియు స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
- By manojveeranki Published Date - 12:45 PM, Tue - 13 August 24

Chirutha At Srisailam: శ్రీశైలంలో (Srisailam) మఠానికి చేరువలో ఉన్న పాతాళగంగకు వెళ్లే మార్గంలో చిరుతపులి (Cheetha) సంచారం జరుగుతోంది. ఈ ఘటన భక్తులను (Piligrim) మరియు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆలయ ఏఈవో ఇంటి సమీపంలో చిరుతపులి కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలో (CCTV Footage) స్పష్టంగా చూపించింది.
ప్రహరీ గోడపై చిరుత (Chirutha) నడుస్తూ కనిపించింది. వీడియోలో, చిరుత క్రమంగా నడుస్తూ అక్కడ ఉన్న కుక్కను ఎత్తుకెళ్లినట్లుగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున, చిరుత గమనించిన ప్రాంతాలు పలువురి ఇళ్ల ముందు కూడా ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసంచార ప్రాంతంలో చిరుత (Chirutha) సంచారం ఉంటున్నందున, చాలామంది బయటకు రాకుండా ఉంటున్నారు. చిరుతపులి సంచారాన్ని అటవీ అధికారులు (Forest Officers) సమీక్షించి, ఆ ప్రదేశాన్ని పరిశీలించి, చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకున్నారు.