Lawyer Sidharth Luthra : ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూత్రా చేసిన వాదనలు ఇవే..
అసలు ఏసిబి దర్యాప్తు చేయాల్సిన కేసు సిఐడి ఎందుకు ఎంక్వయిరీ చేస్తుంది
- By Sudheer Published Date - 01:12 PM, Sun - 10 September 23

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఉదయం నుండి వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపిస్తుండగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా (Lawyer Sidharth Luthra) వాదనలు వినిపిస్తున్నారు.
సిద్ధార్థ్ లూత్రా (Lawyer Sidharth Luthra) దేశంలోని టాప్-10 లాయర్లలో ఒకరు. అలాంటి ఈయన చంద్రభాను తరుపున వాదిస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏసీబీ కోర్ట్ లో సిద్దార్థ్ ఎలాంటి వాదనలు తీసుకొచ్చారనేది చూస్తే..
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Case) అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అని వాదించారు. ఇది పూర్తిగా చంద్రబాబును ఇరికించే కుట్ర అని , చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ వ్యవహరించిందని లుత్రా వాదించారు. అరెస్టు చేసే ముందు కనీసం గవర్నర్ అనుమతి కూడా సీఐడీ అధికారులు తీసుకోలేదని లుత్రా కోర్టుకు వివరించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారులు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణలను కోర్టుకు సమర్పించాలని లుత్రా డిమాండ్ చేశారు. అంతేకాక, రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని లుత్రా కోరారు.
అసలు ఏసిబి దర్యాప్తు చేయాల్సిన కేసు సిఐడి ఎందుకు ఎంక్వయిరీ చేస్తుంది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫై చేసినవి ఆధారాలు లేని ఆరోపణలు..సిబిఐ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు. చంద్రబాబు ను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేసినట్లు చెపుతుంది. కానీ చంద్రబాబుని ముందు రోజు రాత్రి 11 గంటలకే CID పోలీసులు చుట్టుముట్టారు. ఆ సమయం నుండే అరెస్ట్ చేసినట్లుగా పరిగణించాలని కోరిన సిద్దార్థ్.
Read Also : AP : చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ రెడీ చేస్తున్న పోలీసులు
ఈ సందర్భంగా గతంలో పంజాబ్ మణిందర్ సింగ్ కేసును కూడా లుత్రా ప్రస్తావించారు. 2021 డిసెంబరులో ఈ వ్యవహారంలో కేసు నమోదైతే అప్పుడు చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని కోర్టు అడిగింది. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం భోజన విరామం ఇచ్చారు. తిరిగి 1:30 నిమిషాలకు విచారణ మొదలుకానుంది.
ఇక సిద్ధార్థ్ లూథ్రా విషయానికి వస్తే.. సిద్దార్థ్ తండ్రి కె.కె. లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా.. న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. LLB 1990లో పూర్తి చేశారు. మానవ హక్కులు, రాజ్యాంగ చట్టాలు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతేకాదు.. ఆయన కొన్ని పుస్తకాలను కూడా రాశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది. ఒకసారి సిద్దార్థ్ కోర్టులో హాజరయ్యేందుకు ఆయన రూ.5 లక్షలు పుచ్చుకుంటారు. రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలన్నీ అదనం. కేసును బట్టి గంటకు రూ.15 లక్షలవరకు తీసుకుంటారట. ఈయన ఎంతైనా తీసుకొని..మా అధినేతను బయటకు తీసుకొస్తే చాలు అని టీడీపీ శ్రేణులు అంటున్నారు.