Amaravati : అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు
Amaravati : అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు
- By Sudheer Published Date - 08:27 AM, Thu - 20 March 25

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati )లో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GMO సిఫార్సుల మేరకు ఈ భూకేటాయింపులు చేపట్టారు. అభివృద్ధి ప్రణాళికల ప్రకారం, విద్య, ఐటీ, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ భూములను కేటాయించారు. ఈ నిర్ణయం అమరావతిలో విద్య, ఆరోగ్య, ఐటీ రంగాల ప్రగతికి దోహదపడనుంది.
BJP Chief Post : బీజేపీ చీఫ్ రేసు.. ఆ నలుగురి మధ్యే ప్రధాన పోటీ
భూకేటాయింపులలో భాగంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ (BITS) కు 70 ఎకరాలు కేటాయించగా, L&T సంస్థకు 10 ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్ నిర్మాణానికి కేటాయించారు. అదే విధంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కు 25 ఎకరాలు, హడ్కో హ్యాబిటేట్ సెంటర్ కు 8 ఎకరాలు భూకేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, అమరావతి వ్యాపార, ఐటీ, పరిశ్రమల కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది.
అలాగే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా భూములు కేటాయించారు. IRCTC ప్రతిపాదన మేరకు బడ్జెట్ హోటల్ కోసం భూమి కేటాయించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే అమరావతిలో విద్యా, వైద్య, ఐటీ, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాజధానిలో బౌద్ధిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ భూకేటాయింపులు సహాయపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.