HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kuna Srisailam Joins Congress

Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

  • Author : Sudheer Date : 05-04-2024 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kuna Joins Cng
Kuna Joins Cng

కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల చేరికలు రోజు రోజుకు ఎక్కవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా…నేడు బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ (BJP leader Kuna Srisailam Goud) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఈ టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు కాంగ్రెస్‌లో చేరారు. నిన్న కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంతరెడ్డి, భూపతిరెడ్డిలు ఆయన నివాసానికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ఆయన మన్నించారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. 2009లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఇండిపెండెంట్గా కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో బీజేపీలో చేరిన ఆయన.. 2023లో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ చేతిలో 85,576 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన కూన.. అక్కడి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. దీపాదాస్‌ మున్షీ, రేవంత్‌ రెడ్డిలు కూన శ్రీశైలం గౌడ్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

Read Also : Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం కోసం.. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • kuna srisailam goud
  • Qutbullapur

Related News

Bigshock

TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Party Candidates, Voters Te

    Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd