KTR: నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది.
- By Balu J Published Date - 11:22 AM, Wed - 4 October 23

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. హెలికాఫ్టర్ లో దిలావర్ పూర్ మండలం గుండంపల్లి చేరుకున్న కేటీఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో గుండంపల్లిలో లక్ష్మీ నరసింహ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభిస్తారు. అనంతరము దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్ ను పరిశీలించి పూజ నిర్వహించనున్నారు. సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.