Lagacharla Controversy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..లగచర్ల భూసేకరణ రద్దు
ప్రజల అభిష్ఠాం మేరకు లగచర్లలో భూసేకరణ ప్రకటన వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దీని కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
- By Latha Suma Published Date - 02:26 PM, Fri - 29 November 24

Lagacharla Land Acquisition : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రజల అభిష్ఠాం మేరకు లగచర్లలో భూసేకరణ ప్రకటన వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దీని కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. 580 మంది రైతుల నుంచి ఈ భూమిని సేకరించాలని 2024, ఆగస్టు 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటీఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
మరోవైపు ఈనిర్ణయం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేత నేడు లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అషామాషీగా చేసింది.. కాదనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాల వద్ద ఉన్న అస్త్రాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందని అంటున్నారు. అయితే దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో పోరుబాట పట్టింది. జాతీయ ఫోరమ్‌లకు ఫిర్యాదు చేసింది. వివిధ సంఘాలను ఇక్కడకు రప్పించి మరీ పరిస్థితి అంచనా వేయాలని సూచించింది. లగచర్ల బాధితులు, బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులో జాతీయ సంఘాలు కూడా కదిలాయి. ఇక్కడకు వచ్చి బాధితుల గోడు విన్నాయి.
కాగా, కాంగ్రెస్ సర్కార్ దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో పార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక రైతులు పార్మా కంపెనీలకు భూమిని ఇచ్చేందుకు అంగీకరించలేదు. లగచర్లలో 632 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. 580 మంది రైతులు గిరిజనులు. వీరికి ఎకరం, అర ఎకరం భూమి మాత్రమే ఉంది. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా భూములు ఇచ్చేందుకు అడ్డంకిగా మారింది.
ఇకపోతే..ఈ నెల 11న లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయసేకరణను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులను పోలీసులు రక్షించారు. ఈ క్రమంలోనే కడా అధికారి వెంకట్ రెడ్డిని స్థానికులు కొట్టారు. అడ్డుకున్న డీఎస్పీ పై కూడా స్థానికులు దాడికి చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read Also: Adani issue : అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: వైఎస్ షర్మిల