CM KCR: సింగరేణి కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్
సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందించారు.
- By Balu J Published Date - 06:09 PM, Thu - 5 October 23

CM KCR: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీ, ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు కురిపించిన కేసీఆర్ తాజాగా సింగ రేణి కార్మికులకు తీపి కబురు అందించారు. ఈ మేరకు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను అక్టోబర్ 16వ తేదీన చెల్లించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్‌ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి ట్రైలర్ వచ్చేస్తోంది!