Vemula Veeresham: కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు- వేముల వీరేశం
ఏ పార్టీలో చేరాలన్నది కార్య కర్తల అభిప్రాయం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని వేముల అన్నారు.
- By Balu J Published Date - 12:17 PM, Fri - 25 August 23

తనపై పోలీసు కేసులు పెడుతున్నా, తన అనుచరులను వేధిస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉండిపోయారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆందోళన వ్యక్తం చేశాడు. నాలుగున్నరేళ్లుగా మానసిక వేదనను అనుభవిస్తున్నా, ఇకపై ఓపిగ్గా ఉండలేను. దయనీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీలో చేరాలన్నది కార్య కర్తల అభిప్రాయం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని వేముల అన్నారు.
నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల 10వేల మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశమయినట్లు తెలిసింది. ప్రతీ మండలం నుంచి 100 మందిని మాట్లాడించేందుకు సుదీర్ఘ షెడ్యూల్‌ను ఖరారు చేసి సమావేశం కావడం గమనార్హం. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా? అనే అంశంపై వీరేశం వర్గం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.
Also Read: National Film Awards: జై భీమ్ కు దక్కని జాతీయ అవార్డు, జ్యూరీపై తమిళ్ ఫ్యాన్స్ ఫైర్