Karnataka : కర్ణాటకలో దారుణం.. స్టూడెంట్‌ని కొట్టి చంపిన టీచర్
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.గడగ్ జిల్లాలోని హాడ్లిన్ గ్రామంలో 4వ తరగతి స్టూడెంట్‌ని ముత్తప్ప అనే టీచర్ కొట్టి
- Author : Prasad
Date : 19-12-2022 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.గడగ్ జిల్లాలోని హాడ్లిన్ గ్రామంలో 4వ తరగతి స్టూడెంట్‌ని ముత్తప్ప అనే టీచర్ కొట్టి చంపాడు. ప్రస్తుతం టీచర్ ముత్తప్ప పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టీచర్ కోసం గాలిస్తున్నారు. ఉపాధ్యాయుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మోడల్ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో క్లాసులు చెప్తున్నాడు. క్లాస్‌లో విద్యార్థిని ఇనుప రాడ్‌తో కొట్టి, పాఠశాల ఆవరణలోని మొదటి అంతస్తు నుండి విసిరివేసినట్లు టీచర్‌పై ఆరోపణలు వచ్చాయి. మృతి చెందిన విద్యార్థి భరత్ బార్కర్‌గా గుర్తించారు. బార్కర్ తల్లి..అదే క్యాంపస్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే ఆమె జోక్యం చేసుకుని కోపోద్రిక్తుడైన టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. స్టూడెంట్‌ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గీతా బార్కర్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా, ఆమెను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.