HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kamal Haasan Outraged At Governor

Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kamal Haasan Outraged at Governor
Kamal Haasan Outraged at Governor

తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్ కి కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ

— Prakash Raj (@prakashraaj) May 7, 2026

தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது.

என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…

— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ కు చెందిన టీవీకే పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలు లేవంటూ రాష్ట్ర గవర్నర్ జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటోన్న పరిణామాలపై సీనియర్ నటుడు, ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. టీవీకే పార్టీ అధిక స్థానాల్లో గెలిచినప్పటికీ ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడం ప్రజా తీర్పును అగౌరవపరచడమేనని, ఇది రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆయన అన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ తీరుపై కమల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, ఏ ఒక్క పార్టీకీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు కట్టబెట్టలేదు. తమిళనాడు చరిత్రలో ఇటువంటి ఫలితం రావడం ఇదే ప్రథమం. నా సోదరుడు ఎంకే స్టాలిన్ గారు, ‘మేము ప్రజల తీర్పును గౌరవిస్తాము. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాము’ అని ప్రకటించారు. ఆయన రాజకీయ పరిపక్వతను నేను గౌరవిస్తాను. ప్రస్తుతం రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కూడా ఇప్పుడు తమ విధిని నిర్వర్తించాలి. ఇది ఒక డిమాండ్ కాదు, వారి రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తుచేయడం మాత్రమే

విజయ్ గారి నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనను ఆహ్వానించకపోవడం అనేది, తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుంది. ఎన్నికైన 233 మంది సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ఇది రాష్ట్రానికి జరిగిన అవమానం; ఇది ప్రజాస్వామ్యానికి కలిగిన నష్టం. ‘మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలోనే నిరూపించుకోవాలి’ అని S.R. బొమ్మై కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు. ఇది ఒక భారతీయ పౌరుడి విధానపరమైన గళం. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలి అని కమల్ హాసన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

మరోవైపు తమిళనాడు గవర్నర్ వైఖరిని నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. విజయ్ కు ప్రజా తీర్పు వచ్చిందని, సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ”గవర్నర్ ప్రవర్తన అత్యంత అసహ్యకరమైనది, ఆమోదయోగ్యం కానిదిరా. ఇది జ్యాంగ విరుద్ధమైనది. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు… కానీ విజయ్ కు ప్రజల తీర్పు లభించింది. సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి” అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ను విజయ్ కలిసిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన పోస్ట్‌తో మద్దతు తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Kamal Haasan
  • Actor Prakash Raj
  • Governor
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam
  • tvk

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

    Latest News

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd