Kacha Badam: కారు ప్రమాదంలో గాయపడిన కచ్చాబాదం సింగర్
- Author : HashtagU Desk
Date : 01-03-2022 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కచ్చాబాదం పాట మార్మోగిపోతోంది. కచ్చాబాదం పాట సెన్షేషన్ క్రియేట్ చేయడంతో, భుబన్ బద్యాకర్ ఒవర్ నైట్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. భుబన్ బద్యాకర్‌కు పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో నిన్న ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఇటీవల అతను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనలో అతడి చాతీకి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతడి చాతికి, అదే విధంగా శరీరంలో పలు చోట్ల స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను సూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇకపోతే ఈ పాటను క్రియేట్ చేసిన భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంల్‌లో పల్లీలు అమ్ముతూ వీధుల్లో ఈ పాటను పాడేవాడు. బద్యాకర్ టాలెంట్ గుర్తించి ఒక యూట్యూబర్, అతడు పాడిన కచ్చా బాదమ్ వీడియోను తన యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. అంతే కచ్చా బాదమ్ సాంగ్ ఓ రేంజ్‌లో సునామీ సృష్టిస్తోంది. ఇక అది చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ పాటకు రిమిక్స్ జోడించి వైరల్ చేచడంతో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.