IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు (IT Raids) మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. వసుధ ఫార్మా, పెట్రో కెమికల్ సంస్థలపై IT దాడులు కొనసాగుతున్నాయి. రెండు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు.
- Author : Gopichand
Date : 31-01-2023 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు (IT Raids) మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. వసుధ ఫార్మా, పెట్రో కెమికల్ సంస్థలపై IT దాడులు కొనసాగుతున్నాయి. రెండు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, వెంగళరావు నగర్, జీడీమెట్ల కంపెనీల కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. వసుధ గ్రూప్ సంస్థ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో, ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 50 బృందాలుగా ఏర్పడిన IT అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read: Gold And Silver Price Today: బంగారం ధరలు ఇలా.. వెండి ధరలు అలా..!