Gold And Silver Price Today: బంగారం ధరలు ఇలా.. వెండి ధరలు అలా..!
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) మంగళవారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరిగాయి. జనవరి 31న హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,440గా నమోదైంది.
- By Gopichand Published Date - 08:05 AM, Tue - 31 January 23
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) మంగళవారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరిగాయి. జనవరి 31న హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,440గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో ఈ రేట్లే కొనసాగుతున్నాయి. కాగా హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,700 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మంగళవారం ఈ విధంగా ఉన్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (జనవరి 31, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,590గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,370గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,440 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,650 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
Also Read: Smartphones: ఫిబ్రవరిలో మార్కెట్ లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,400 ఉండగా, ముంబైలో రూ.72,400గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, కోల్కతాలో రూ.72,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, కేరళలో రూ.74,700గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, విజయవాడలో రూ.74,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
Related News
Gold- Silver Price: చాలా రోజుల తర్వాత బంగారం ధర తగ్గుదల.. ఎంతంటే..?
మీరు కూడా బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. చాలా కాలం తర్వాత బంగారం ధర (Gold- Silver Price) తగ్గింది. కాగా వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.