Israel : అమెరికా యుద్ధనౌక ఇంటికి.. గాజా నుంచి చాప చుట్టేస్తున్న ఇజ్రాయెల్
Israel Back : అక్టోబరు 7 నుంచి అతిచిన్న నగరం గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు వెనకడుగు వేస్తోంది.
- By Pasha Published Date - 08:24 AM, Tue - 2 January 24

Israel : అక్టోబరు 7 నుంచి అతిచిన్న నగరం గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. అక్కడి నుంచి తమ ఆర్మీని వెనక్కి పిలిపించుకుంటోంది. ఇప్పటికే గాజాలోని పలు ప్రాంతాల నుంచి యుద్ధ ట్యాంకులను వెనక్కి పిలిపించారు. గాజాపై గ్రౌండ్ ఎటాక్ కోసం ఇజ్రాయెల్ ఆర్మీ మర్కావా మోడల్‌కు చెందిన అధునాతన యుద్ధ ట్యాంకులను వాడింది. అయితే ఇవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఒక్కో మర్కావా యుద్ధ ట్యాంకు ధర రూ.30 కోట్లు. గాజాలో హమాస్ మిలిటెంట్లు గత 80 రోజుల యుద్ధంలో దాదాపు 800 మర్కావా యుద్ధ ట్యాంకులను పేల్చేశారు. దీన్నిబట్టి ఇజ్రాయెల్ ఆర్మీకి ఎంత రేంజ్‌లో ఆర్థిక నష్టం కలిగిందో అంచనా వేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేయగానే.. ఇజ్రాయెల్ దేశానికి రక్షణ కల్పించేందుకు అమెరికా రంగంలోకి(Israel) దిగింది. ఇతర అరబ్ దేశాల నుంచి ఇజ్రాయెల్‌పైకి దాడులు జరగకుండా అడ్డుకునేందుకు తూర్పు మధ్యధరా సముద్రంలో తమ యుద్ధనౌక ‘గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్’ను అమెరికా మోహరించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల వల్ల దాదాపు 21వేల మంది సామాన్య గాజా పౌరులు చనిపోవడంతో అమెరికాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెరిగింది. ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని కూడా అమెరికా వీటో చేసింది. అంటే ఇజ్రాయెల్ దాడులను అమెరికా సమర్ధించడాన్ని ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. ఈనేపథ్యంలో స్వరం మార్చిన అమెరికా.. జనవరి 1 తర్వాత యుద్ధం కంటిన్యూ చేయొద్దని ఇజ్రాయెల్‌కు అల్టిమేటం ఇచ్చింది. దాని ప్రకారమే.. జనవరి 1న ‘గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్’ను ఇజ్రాయెల్ సముద్ర తీరం నుంచి వెనక్కి పిలిపించింది. అది తన స్థావరమైన అమెరికాలోని వర్జీనియా ఓడరేవుకు చేరుకోనుంది. ఇన్నాళ్లూ అమెరికా ఆయుధ బలం, నేవీ సహకారంతో యుద్ధం చేసిన ఇజ్రాయెల్.. అమెరికా యుద్ధనౌక అలా ఇంటికి వెళ్లిపోయిందో లేదో గాజా నుంచి చాప చుట్టేయడం మొదలుపెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో తమ దేశానికి చెందిన బందీలను విడిపించుకునేందుకు హమాస్‌తో ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోనుందని తెలుస్తోంది.