Israel : భారత్‌ని క్షమాపణలు కోరిన ఇజ్రాయిల్
Israel : ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) శుక్రవారం విడుదల చేసిన ఒక మ్యాప్ భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది.
- By Kavya Krishna Published Date - 11:46 AM, Sat - 14 June 25

Israel : ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) శుక్రవారం విడుదల చేసిన ఒక మ్యాప్ భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలను నేపాల్‌లో భాగంగా చూపించడం వల్ల భారతదేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తృతస్థాయిలో నెటిజన్లు ఇజ్రాయెల్‌పై సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ క్షిపణుల పరిధిని వివరించేందుకు ఐడీఎఫ్ విడుదల చేసిన ఈ గ్రాఫిక్‌లో భారత్, రష్యా, చైనా సహా 15 దేశాలు చూపించబడ్డాయి. ఇందులో భారతదేశం ప్రస్తావించడమే కాక, దాని భౌగోళిక సరిహద్దులను తప్పుగా ప్రదర్శించడం వివాదాస్పదమైంది. “ఇరాన్ ఒక ప్రపంచ ముప్పు. ఇది కేవలం మొదటి దశ మాత్రమే” అంటూ గ్రఫ్ లో పేర్కొంటూ, “చర్య తీసుకోవడం మాకైతే తప్పనిసరి” అనే వాఖ్యలు జోడించారు.
Lunch Box : పిల్లల లంచ్ బాక్సులో ఏమేం ఉండాలంటే?
ఈ మ్యాప్‌పై భారతదేశం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జాతీయ గౌరవానికి భంగం కలిగేలా భౌగోళిక సరిహద్దులను తారుమారు చేయడాన్ని భారతీయులు తీవ్రంగా ఖండించారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, తప్పుగా ప్రదర్శించిన మ్యాప్‌పై క్షమాపణలు తెలిపింది. ‘‘ఈ మ్యాప్ దేశ సరిహద్దులను ఖచ్చితంగా వివరించడంలో విఫలమైంది. ఈ తప్పు వల్ల ఎవరైనా బాధపడితే మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం,’’ అని ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న వేళ, ఈ మ్యాప్ వివాదం మరో రాజనీతిక మలుపు తిప్పినట్టయ్యింది. భారతదేశాన్ని క్షిపణి పరిధిలో చూపడమే కాకుండా, జాతీయ పరిమితులను తారుమారు చేయడం విమర్శనీయమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.