IND vs SL: టీమిండియాకు షాక్.. మూడో టీ20 కి ఆ ఫ్లేయర్ దూరం
- By Naresh Kumar Published Date - 03:21 PM, Sun - 27 February 22
తలకు గాయం కారణంగా ఇషాన్ కిషన్ శ్రీలంకతో జరగనున్న మూడో టీ20కి దూరంగా ఉన్నాడు. శనివారం ధర్మశాలలో జరిగిన 2వ టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ సమయంలో తలపై దెబ్బ తగలడంతో ఇషాన్ కిషన్ ని చెక్-అప్ కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ నిర్వహించారు. ఇషాన్ కిషన్ కండిషన్‌ని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుందని భారత క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో తెలిపింది. గాయం కారణంగా ఇషాన్ మూడో మరియు చివరి టీ20కి దూరమవుతాడని బీసీసీఐ ట్వీట్‌లో పేర్కొంది.