IPL 2023 Final Tickets: క్వాలిఫైయర్-2 టికెట్ రేట్ కాస్ట్ లీ గురూ
ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
- By Praveen Aluthuru Published Date - 07:42 PM, Thu - 25 May 23

IPL 2023 Final Tickets: ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది. . గుజరాత్ టైటాన్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య రెండవ క్వాలిఫైయర్ 26 మే 2023న జరుగుతుంది.
ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు కొనేందుకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కూర్చుని ఐపీఎల్ రెండవ క్వాలిఫైయర్ మరియు ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో ఆన్‌లైన్ టిక్కెట్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. టిక్కెట్లను Paytm ఇన్‌సైడర్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఐపీఎల్ 2023 రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. దీని టిక్కెట్ ధర 800 రూపాయల నుండి ప్రారంభమై 10,000 వరకు నడుస్తుంది. క్వాలిఫయర్-2, ఫైనల్ టిక్కెట్ల విషయంలో అభిమానుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఐపీఎల్ 2023 టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం.
ముందుగా Paytm insider.in కి వెళ్లండి.
ఆపై హోమ్‌పేజీలో టిక్కెట్ల క్లిక్ బటన్ పై క్లిక్ చేయండి.
తర్వాత బై ని ఎంపిక చేసుకోవాలి.
దీని తర్వాత మీరు మీకు ఇష్టమైన సీటు మరియు ధరను ఎంచుకోవచ్చు.
చివరగా మొత్తాన్ని ఫిల్ చేసి అప్లయ్ చేస్తే.. టిక్కెట్లు మెయిల్‌కు డెలివరీ అవుతాయి.
Read More: IPL 2023: నవీన్ ఉల్ హక్‌కు ముంబై ఆటగాళ్లు కౌంటర్.. ఏం చేశారంటే..?

Related News

MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్
ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి . మైదానంలో నిశ్శబ్దం. జడేజా చేతిలో బ్యాట్ మరియు మోహిత్ శర్మ బౌలింగ్. చెన్నై, గుజరాత్ ఆటగాళ్లలో టెన్షన్