Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : భారత్‌లో బంగారానికి మస్తు డిమాండ్ ఉంటుంది. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏదైనా సరే బంగారం కొనాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాలతో అంతలా ముడిపడిపోయింది. గోల్డ్ రేట్లు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా మారుతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు రేట్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 09:34 AM, Tue - 17 December 24

Gold Price Today : భారతీయులు పసిడి అంటే ఎంతో మక్కువ చూపిస్తారు. ఇది మహిళలకు అలంకరణ మాత్రమే కాకుండా, పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పండగలు, వివాహాలు, ఇతర వేడుకల సమయంలో మహిళలు గోల్డ్ కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. ఈ కారణంగా పండుగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్ మరింత పెరుగుతుంది. దేశీయంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్లో కూడా పెరుగుతాయి; అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి. ఇలాగే, ధరలు స్థిరంగా ఉన్నప్పుడు దేశీయంగా కూడా పెద్దగా మార్పు ఉండదు.
బంగారం ధరలు తరచుగా మారుతుండటంతో వాటి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాలవారీగా, స్థానిక పన్ను రేట్ల ఆధారంగా మారుతూ ఉంటాయి.
Festive season 2024 : దుబాయ్‌లో పండుగ సీజన్ 2024
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు:
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2657 డాలర్ల వద్ద ఉంది. గతరోజు కంటే ఈ రేటులో పెద్దగా మార్పు లేదు. సిల్వర్ రేటు కూడా 30.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతూ ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ. 84.96 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో:
22 క్యారెట్ల బంగారం: తులం ధర రూ. 71,400
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 77,890
ఢిల్లీలో:
22 క్యారెట్ల బంగారం: తులం ధర రూ. 71,550
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 78,040
సిల్వర్ ధరలు:
ఢిల్లీలో కిలో వెండి ధర: రూ. 92,500
హైదరాబాద్‌లో కిలో వెండి ధర: రూ. 1,00,000
బంగారం స్వచ్ఛత:
బంగారం స్వచ్ఛతను క్యారెట్ల ద్వారా కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని పూర్తి స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారంగా పరిగణిస్తారు. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. నగల తయారీకి 22 క్యారెట్ల బంగారం (916 స్వచ్ఛత) వినియోగిస్తారు.
ఫెడరల్ రిజర్వ్ ప్రకటనపై ఆశలు:
ఈ బుధవారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనుంది. గత రెండు సమీక్షలలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ డిమాండ్ తగ్గి, బంగారం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా, స్థిరంగా ఉంచుతుందా లేదా పెంచుతుందా అనేది చూస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంది.
(గమనిక: గోల్డ్, సిల్వర్ ధరల మార్పు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఉంటాయి. పెట్టుబడిదారులు, కొనుగోలు దారులు బంగారం ధరల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం మంచిది.)
International Gita Mahotsav : ప్రత్యేక ప్రపంచ గుర్తింపును పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రం