India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
- Author : Gopichand
Date : 25-01-2024 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
India vs England: భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ భారత్‌కు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇరు జట్లకు కెప్టెన్లు, కోచ్‌ల మార్పు జరిగింది. 2020/21 సిరీస్‌లో భారత్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నాడు. ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు జట్టులో అంతర్భాగంగా ఉన్నారు.
ఈసారి, ఆ ఇద్దరు ప్రముఖులు జట్టుకు దూరంగా ఉండగా, కోహ్లీ మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ మొదటి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. హైదరాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముగ్గురు స్పిన్ బౌలర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చాడు.
భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.
We’re now on WhatsApp. Click to Join.