HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Squad Sl Series Virat Kohli Likely To Skip T20s

Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం

వెస్టిండీస్‌ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..

  • Author : Naresh Kumar Date : 18-02-2022 - 5:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

వెస్టిండీస్‌ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా.. టీ ట్వంటీ సిరీస్‌కు కోహ్లీ దూరం కానున్నాడు. బిజీ షెడ్యూల్ నుండి విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. లంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళకు బీసీసీఐ రొటేషన్ పాలసీలో విశ్రాంతినిస్తోంది. ఇదిలా ఉంటే విండీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే లక్నో చేరుకున్న జడేజా క్వారంటైన్‌లో ఉన్నాడు. జడేజాతో పాటే బూమ్రాకు కూడా విండీస్‌తో సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

కాగా ప్రస్తుతం విండీస్‌తో ఆడుతున్న జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్,రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ విండీస్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో రీప్లేస్‌మెంట్స్‌గా వచ్చిన వారే జట్టుతో పాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా గాయాల నుండి కోలుకున్న వారు వచ్చినా క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్తగా కొందరిని బ్యాకప్‌గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.

శ్రీలంకతో ఫిబ్రవరి 24 నుండి టీ ట్వంటీ సిరీస్ మొదలు కానుండగా.. మార్చి 4 నుండి టెస్ట్ సిరీస్ షురూ కానుంది. వెస్టిండీస్‌తో చివరి టీ ట్వంటీ ముగియడంతోనే సెలక్టర్లు జట్టు ఎంపికపై ప్రకటన చేయనున్నారు. తొలి టీ ట్వంటీ లక్నోలో జరగనుండగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లకూ ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఇక తొలి టెస్ట్ మొహాలీలో జరగనుండగా… రెండో టెస్ట్‌ డే నైట్‌ మ్యాచ్‌గా బెంగళూరులో నిర్వహించనున్నారు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్ట్‌. నిజానికి బెంగళూరులోనే ఈ మ్యాచ్ జరుగుతుందని భావించినా.. బీసీసీఐ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలాగే లంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తితో ముందే టీ ట్వంటీ సిరీస్ ఉండేలా షెడ్యూల్‌లో మార్పులు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india vs sri lanka
  • kohli likely to skip T20
  • srilanka series
  • virat kohli

Related News

King Kohli Posted An Instag

కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

Virat Kohli  2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప

  • Abhishek Sharma

    ఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • Sanju Samson

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

  • IPL 2026

    RCB అభిమానులకు గుడ్ న్యూస్!

Latest News

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

  • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

Trending News

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd