Covid Report: రికార్డుస్థాయిలో తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో 1,61,386 కొత్త COVID-19 కేసులు, 1,733 మరణాలు బుధవారం నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
- By Balu J Published Date - 01:07 PM, Wed - 2 February 22

గత 24 గంటల్లో భారతదేశంలో 1,61,386 కొత్త COVID-19 కేసులు, 1,733 మరణాలు బుధవారం నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,16,30885కి చేరుకోగా, మరణాల సంఖ్య 4,97,975కి చేరుకుంది. దేశంలో మంగళవారం 1,67,059 కొత్త కేసులు, 1,192 మరణాలు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 16,21,603కి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం COVID-19 కేసులలో 3.90 శాతం. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతానికి పడిపోగా, వారంవారీ పాజిటివిటీ రేటు కూడా 14.15 శాతానికి పడిపోయింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో 2,81,109 రికవరీలు నమోదయ్యాయి, మొత్తం రికవరీల సంఖ్య 3,95,11,307కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 94.91 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 17,42,793 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.24 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్ కింద ఇప్పటివరకు 167.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందాయి. అయితే నిన్నటి మొన్నటివరకు కరోనా కేసులు రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. ఉన్నట్టుండి భారీగా కేసులు తగ్గిపోయాయి.