Cyber Security Summit: సైబర్ థీమ్ పార్క్ ప్రారంభం, కీలక అంశాలపై చర్చ!
ASCI &, ESF ల్యాబ్స్ లిమిటెడ్ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ సంయుక్తంగా నిర్వహించబడింది.
- By Balu J Published Date - 05:06 PM, Mon - 20 November 23
Cyber Security Summit: హైదరాబాద్ వేదికగా సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) మరియు ESF ల్యాబ్‌ల అధ్వర్యం లో సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. ఈ శిఖరాగ్ర సదస్సు పరిశ్రమలలోని విశిష్ట వ్యక్తులను, ప్రముఖ నిపుణులు ఒకే చోట కలుసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ ఔత్సాహికులు సైబర్ సెక్యూరిటీ అభివృద్ధి, సవాళ్లు, ఆవిష్కరణల గురించి వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కీనోట్ ప్రెజెంటేషన్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు, థ్రెట్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్, ఎమర్జింగ్ టెక్నాలజీల వంటి క్లిష్టమైన అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పద్మభూషణ్ కె. పద్మనాభయ్య IAS (రిటైర్డ్), CoG, ASCI చైర్మన్, మాజీ కేంద్ర హోం సెక్రటరీ, GoI తో పాటు డా. నిర్మల్య బాగ్చి, డైరెక్టర్ జనరల్ (I/c), ASCI, డాక్టర్ P R మధుసూదనన్, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, ASCI, Mr. అనిల్ అనిసెట్టి, ESF ల్యాబ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ ఉన్నారు.
Also Read: Srikanth: దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం