Srikanth: దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం
సినీ నటుడు, హీరో శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.
- By Balu J Published Date - 04:32 PM, Mon - 20 November 23

Srikanth: సినీ నటుడు, హీరో శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్ బిగ్ బాస్ షోలో సందడి చేశాడు. అయితే శ్రీకాంత్ కాలుకు ఉన్న కట్టును చూసి హీరో నాగార్జున అడిగాడు. గోవాలో దేవర షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఇసుక తిన్నెలో పరుగెత్తుతుండగా.. కాలు బెణికిందని బదులిచ్చాడు. షూటింగ్‌లో ఉండగా జరిగిందనీ, ఆ తర్వాత కొద్దిరోజులకు వాపు పెరిగిందనీ, డాక్టర్ దగ్గరకు వెళితే రెస్ట్ తీసుకోమని చెప్పారని అన్నాడు.
నిజం చెప్పండి ఈ గాయం తారక్ వల్లేనా? కామెడీ అని నాగ్ అడగ్గా, తారక్ వల్ల కాదు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు శ్రీకాంత్. హీరో శ్రీకాంత్ కెరీర్‌లో దాదాపు అన్ని హిట్ సినిమాలే.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా చేస్తున్నాడు. కానీ సరైన బ్రేక్ రావడం లేదు. అఖండ సినిమాలో విలన్‌గా కనిపించినా మంచి ఆఫర్స్ రాలేదు. శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్స్‌లో తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ‘కోటబొమ్మాళి పిఎస్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఆఖండ సినిమాలో నటించిన శ్రీకాంత్.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ లో నూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: Vijayakanth: ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు విజయ్ కాంత్.. ఆందోళనలో అభిమానులు
Related News

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 2022 నుండి యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై అతిపెద్ద డ్రోన్ దాడిని నిర్వహించింది.